Jan 18,2021 19:47

చంఢగీడ్‌: హర్యానాలో చోటుచేసుకున్న ఘటన మానవ సమాజం తలదించుకునేలా చేసింది. బయటనే కాదు.. ఇంట్లోనూ బంధువుల రూపంలో మానవ మృగాలు వుంటాయన్న మాటను మరోసారి ఋజువు చేసిందీ ఘటన. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ అమానుష ఘటన ఇది. హిసార్‌ నగరానికి చెందిన ఓ తండ్రి కన్న కూతురి(17)పై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అది కూడా 7 ఏళ్లుగా అని తేలింది. అంటే 10 ఏళ్ల ప్రాయం నుండే ఆ మృగాడు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన చంఢగీడ్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. అంతేకాదు, యువతి పలుమార్లు గర్భం దాల్చడంతో ఆ తండ్రే దగ్గరుండి మరీ అబార్షన్లు చేయించాడు. అంతేకుండా బాలికను శారీరకంగానూ, మానసికంగానూ హింసించినట్లు పోలీసులు గుర్తించారు.