
చండీగడ్ : హర్యానాలో మొదటి మహిళా ఎమ్మెల్యే, ఎంపి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ చంద్రవతి దేవి (92) ఆదివారం మరణించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె.. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిజిఐఎంఎస్)లో చికిత్స పొందుతున్నారు. 1954లో బంద్రా నియోజకవర్గం (ప్రస్తుతం మహేంద్రఘర్లో ఉంది ) నుండి ఎమ్మెల్యే అయిన మొదటి మహిళ. అలాగే హర్యానాలో మొదటి మహిళా న్యాయవాదిగా కూడా గుర్తింపు పొందారు. అనంతరం 1977లో భివానీ నియోజకవర్గం నుండి చౌదరీ బన్సీలాల్ను ఓడించి మొదటి మొదటి మహిళా ఎంపిగా కూడా ఎన్నికయ్యారు.