Apr 14,2021 20:31

న్యూఢిల్లీ : ప్రస్తుతం మాసంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే బైసఖి, ఉగాది, గుడి పడ్వ, బిహూ, పోయిల బైసఖిల శుభ సందర్బంగా తమ వినియోగదారులకు నూతన ఆఫర్లను అందిస్తున్నట్లు హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌ఐఎల్‌) వెల్లడించింది. పలు మోడళ్లపై రూ.10వేల నుంచి రూ.38,800 వరకు పలు రూపాల్లో రాయితీలు కల్పిస్తోన్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లను ఈ నెల 30 వరకు తమ డీలర్ల వద్ద పొందవచ్చని తెలిపింది.