
హైదరాబాద్ : పలు సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించిన అనికా... తెలుగులో హీరోయిన్గా నటించబోతోంది. తమిళ్‌స్టార్ హీరో అజిత్ నటించిన 'ఎంతవాడు గానీ' సినిమా తెలుగు రీమేక్‌లో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు కేరళ ప్రభుత్వం 2013లో ఉత్తమ బాలనటి అవార్డును బహూకరించింది. ఈమె అసలు పేరు అనికా సురేంద్రన్ అయితే.. మలయాళ చిత్ర పరిశ్రమకు 'బేబీ అనికా'గానే గుర్తింపు. డిఫరెంట్ లవ్‌స్టోరీ అయిన మలయాళ మూవీ 'కప్పేల' భారీ విజయాన్ని అందుకోవడంతో... చిత్ర నిర్మాతలు తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలని... అందులో హీరోయిన్గా అనికాను తీసుకున్నట్లు సమాచారం. హీరోగా విశ్వక్సేన్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. స్పష్టమైన సమాచారం లేదు. ఈ చిత్రాన్ని 'ప్రేమమ్', పవన్‌కల్యాణ్ నటించబోయే 'అయ్యప్పనమ్ కోషియమ్' నిర్మిస్తున్న అదే చిత్ర నిర్మాణ సంస్థే 'కప్పేల' సినిమా రీమేక్‌ను సిద్ధం చేస్తోంది. మరి ఈ సినిమా తెలుగులో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.