Apr 14,2021 20:25

న్యూఢిల్లీ : ద్విచక్ర వాహన దిగ్గజ కంపెనీ హీరో గ్రూపు కొత్తగా నూతన విద్యా సాంకేతిక కంపెనీ హీరో వైర్డ్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడిప్పుడే కొత్తగా సృష్టించబడుతున్న ఉద్యోగాలు, వఅత్తులకు కావలసిన విధంగా వృత్తి నైపుణ్యాలను అందించేలా కృషి చేస్తుందని పేర్కొంది. పోటీ ప్రపంచంలో కొత్తగా తెరపైకి వస్తున్న సాంకేతికతలు, మారిన ఉద్యోగాల స్వరూపం నేపథ్యంలో వాటికి అవసరమైన సామర్థ్యాలను హీరో వైర్డ్‌ అందించనుందని పేర్కొంది.