May 18,2021 22:51

హెచ్‌పిసిఎల్‌కు తరలిస్తున్న భారీ రియాక్టర్‌

ములగాడ : హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విశాఖ రిఫైనరీకి మరో భారీ రియాక్టర్‌ చేరుకుంది. హెచ్‌పిసిఎల్‌ విస్తరణలో భాగంగా గుజరాత్‌లో ఎల్‌ అండ్‌ టి తయారుచేసిన ఈ భారీ రియాక్టర్‌ సముద్ర మార్గాన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌కు చేరింది. అక్కడి నుంచి అత్యాధునిక హైడ్రాలిక్‌ వాహనం ద్వారా లిఫ్ట్‌ అండ్‌ సిఫ్ట్‌ అనే ప్రయివేటు ఎజెన్సీ ఆభారీ రియాక్టర్‌ను రోడ్డు మార్గాన సింధియా మీదుగా హెచ్‌పిసిఎల్‌కు చేర్చింది.రియాక్టర్‌ తరలింపు సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా మల్కాపురం ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ తరలింపులో హెచ్‌పిసిఎల్‌ అధికారులతో పాటు లిఫ్ట్‌ అండ్‌ సిఫ్ట్‌ అధికారులు సంజరు వర్మ, అనీల్‌ లొహౌనా, ఎం సమీర్‌ పాల్గొన్నారు.