
హైదరాబాద్ : ఇలారా టెక్నాలజీస్‌కు చెందిన ప్రేముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ వినూత్నంగా పూర్తిస్థాయి అద్దె, అద్దె సంబంధిత సేవల వేదిక హౌసింగ్ ఎడ్జ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. దీనిద్వారా డీజిటల్ సేవలు బహుళ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. హౌసింగ్ ఎడ్జ్‌తో తమ ఇల్లు వదలకుండానే గఅహ యాజమానులు, అద్దెదారులు సౌకర్యవంతంగా సేవలను పొందగలరని తెలిపింది. అటు యజయానులతో పాటుగా అద్దెదారులకు సైతం లభ్యమయ్యే ఈ సేవలలో ఆన్లైన్ అద్దె చెల్లింపు, ఆన్లైన్ అద్దె ఒప్పందాలు, అద్దెదారుని ధఅవీకరణ, ప్యాకేజింగ్, తరలింపు, ఫర్నిచర్ అద్దె, హోమ్ ఇంటీరియర్స్, గఅహ సేవలు పొందడానికి ఈ కొత్త వేదిక తోడ్పాటును అందించనుందని హౌజింగ్ డాట్ కమ్ తెలిపింది. అధికశాతం హౌసింగ్ ఎడ్జ్ సేవలు ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, ముంబయి, హైదరాబాద్, చెన్నరు, పూనెలలో లభ్యం కానుండగా త్వరలోనే మిగిలిన నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.