May 18,2021 22:57

హైవే రోడ్డుపై క్షుద్రపూజలు చేసిన దృశ్యం

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు: పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారి అయిన ఆదోని - రాయచూరు హైవే ఎన్‌హెచ్‌ 167పై అర్ధరాత్రి సమయంలో ఈ క్షుద్రపూజలు జరిగాయి. మంగళవారం రిలయన్స్‌ పెట్రోల్‌ సమీపంలో ఈ దృశ్యాలు దర్శనమిచ్చాయి. రోడ్‌ ఒక పక్క ముగ్గు వేసి అందులో కాయగూరలు, అన్నం, పసుపు, కుంకుమ వేసి పూజలు నిర్వహించారు. పక్కనే పెద్ద ఎత్తున రక్తం మరకలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు ఒక ట్రాక్స్‌లో మేళ తాళాలతో వచ్చి పూజలు చేశారని, అది దేవర పూజని, పూజ తర్వాత పొట్టేలు బలి ఇచ్చి వెంట తీసుకెళ్లారనిప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ దారి వెంట వెళ్లే వాహన దారులు హైవేపై ఇలా జరగడం పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా హైవే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని కొందరు వాహన దారులు ప్రశ్నించారు