Apr 08,2021 19:22

రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. ఈ సినిమా షూటింగ్‌ కోసం రజినీకాంత్‌ గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. 2020 డిసెంబరులో స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన గత నెలలో చెన్నైలో 'అన్నాత్తే' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించనున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో మీనా, ఖుష్బు, కీర్తి సురేష్‌, నయనతార, జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.