May 16,2021 13:23

హైదరాబాద్‌ : రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌- వి టీకాల రెండవ బ్యాచ్‌ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భారత రాయబారి నికోలరు కుడషేవ్‌ మాట్లాడుతూ కరోనా పోరులో ఇరు దేశాల ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉదాహరణగా నిలవడంతో పాటు...మహమ్మారిపై పోరులో అంతర్జాతీయ సహకారానికి ఓ నమూనాగా నిలిచాయని అన్నారు. ఇలా ఇరు దేశాలు కలిసి పోరాటం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మొత్తం 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత కింద 1.50 లక్షల డోసులు మే 1న భారత్‌కు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నుండి ఈ వ్యాక్సిన్‌లు వేయడం ప్రారంభమైంది. భారత్‌లో వీటి ఉత్పత్తికి తోడ్పడుతున్న రెడ్డీస్‌ల్యాబ్‌.. రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న ఈ వ్యాక్సిన్‌ డోసు ధర రూ. 995గా నిర్ణయించిన సంగతి విదితమే.