Oct 14,2021 16:02

హైదరాబాద్‌: మహిళలపై అరాచక దాడులు ఆగడం లేదు.  ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.