Oct 26,2021 21:27

ముంబయి: భారత మహిళల టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మరో జాక్‌ పాట్‌ కొట్టేసింది. వచ్చే ఏడాది హాంకాంగ్‌ వేదికగా ఆరుజట్ల మధ్య జరగనున్న తొలి ఇన్విటేషన్‌ టి20 టోర్నీలో హాంకాంగ్స్‌ ఫెయిర్స్‌ బ్రేక్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. హాంకాంగ్‌ ఫెయిర్‌బ్రేక్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ టోర్నీ వచ్చే ఏడాది మే 1ా15మధ్య ఆరుజట్ల మధ్య జరగనుంది. ప్రైవేట్‌ కంపెనీలనుంచి ఫండ్‌లను సేకరించడమే థ్యేయంగా చరిత్రలో తొలిసారి మహిళల క్రికెట్‌ టోర్నమెంట్‌ జరగనుంది.