Nov 29,2020 23:08

opening

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: స్థానిక సుందరయ్య భవన్‌ రోడ్డులో స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అవసరమైన వైద్యసేవలను అత్యాధునిక పరికరాలతో అందించేందుకు స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ ప్రారంభమైందన్నారు. జిల్లా ప్రజలు స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ను వినియోగింంచుకొని సేవలు పొందాలని, సంస్థ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ నిర్వాహకులు, రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ కృష్ణసాహిత్‌ రెడ్డి మాట్లాడుతూ స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌లో 32 స్లైస్‌ల సిటీ స్కాన్‌, 5 డి ఆల్ట్రా సౌండ్‌ స్కాన్‌, డిజిటల్‌ మామోగ్రఫీ, డిజిటల్‌ ఎక్స్‌రే, డిజిటల్‌ ఓపిజి, అత్యధిక నాణ్యమైన రిఫరల్‌ ల్యాబ్‌ ఉందన్నారు. జిల్లా ప్రజలకు ఆయా పరీక్షలు అందుబాటు ధరలలో ఉన్నాయన్నారు. స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నందికొట్కూరు ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, ఒంగోలు చైతన్య హాస్పిటల్‌ ఎమ్‌డి డాక్టర్‌ కెవిఆర్‌వి ప్రసాద్‌, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ మన్నె వీరయ్య చౌదరి, కార్యదర్శి డాక్టర్‌ జాలాది మణిబాబు, రమేష్‌ సంఘమిత్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుంపా తిరుమల రెడ్డి, డాక్టర్‌ విజయ రాఘవరావు, రాయల్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ జగదీష్‌, వైసిపి నాయకులు వేమూరి మాల్యాద్రి, వెంకటేశ్వరరెడ్డి సందర్శించి.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.