Jan 03,2021 21:59

బాలింతలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: కోసిగి మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, మండల ఇంచార్జ్‌ పి.మురళీమోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. కోసిగిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ జిల్లా యువజన నాయకులు మఠం జగదీశ్‌ స్వామి,మండల నాయకులు లవకుశ ఈరన్న, నాడిగేని నాగరాజు అద్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు డాక్టర్ల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. నరసింహులు, కాంట్రాక్టర్‌ నాగరాజు, అంజి, నేలకోసిగి లక్ష్మన్న పాల్గొన్నారు.