Jan 15,2022 13:58

ప్రకాశం : నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ, భార్య వసుంధరతో కలిసి కారంచేడులో తన సోదరి పురంధరేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) సంక్రాంతి పండుగ సంబరాల్లో ఆయన గుర్రం ఎక్కి హంగాయా చేశారు. గుర్రం చేత స్టెప్పులు వేయించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు, స్థానికులు దగ్గుబాటి నివాసానికి రావడంతో... కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా పోలీసులు అనుమతించడం లేదు. ప్రస్తుతం దగ్గుబాటి ఇంటివద్ద బాలకృష్ణ చేసే సంక్రాంతి సందడికి సంబంధించిన వీడియోలో నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

వీడియో https://youtu.be/JI7KGTxCjo8