Nov 30,2020 23:01

నివాళి అర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పెద్దాపురం : గురజాడ స్పూర్తితో కవులు, కళాకారులు, మహిళలు చైతన్యవంతంగా ముందుకు సాగాలని సాహితీ స్రవంతి పెద్దాపురం గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాథం చెప్పారు. సోమవారం సూర్యారావు భవనంలో ప్రజానాట్యమండలి, ఐద్వా ఆధ్వర్యాన రొంగల వీర్రాజు అధ్యక్షతన నిర్వహించిన గురజాడ 105వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నేత కె.అరుణ, మంగ, సుబ్బలక్ష్మి, సత్యవతి, మణి, సావిత్రి, డి.కష్ణ, ఎం.రాంబాబు, డి.సత్యనారాయణ, కె.అప్పన్న, వీర్రాజు, మరిడియ్య, నరసింహ మూర్తి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.