Jan 06,2021 14:48

గుంటూరు (కొల్లిపర) : గుంటూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలో కాకులు మృతి చెందాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో 6 కాకులు మృతిచెంది ఉన్నాయి. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల గత కొన్ని రోజులుగా రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ఫ్లూతో వందల సంఖ్యలో కాకులు, బాతులు మృతిచెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోనూ ఈ ఘటన చోటుచేసుకోవడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.