
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారంనుంచి మూడోటెస్ట్ ప్రారంభం కానుంది. మొతేరా స్టేడియంలో (డే/నైట్) ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌లను ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెల్చుకోవడంతో ఈ టెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కోహ్లి సేన అర్హత సాధించాలంటే ఈ టెస్ట్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా దృష్టి సారించి రెండోటెస్ట్‌లో ఆడిన బ్యాట్స్‌మన్ లైనప్‌నే యథాతథంగా కొనసాగించే అవకాశముంది. ఇక బౌలింగ్‌లో మార్పులు తప్పకపోవచ్చు. పేసర్లు బుమ్రాతో పాటు ఫిట్నెస్ నిరూపించుకున్న ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి రానుండగా.. సిరాజ్, కుల్దీప్ను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండోటెస్ట్‌లో సత్తాచాటిన ఆల్‌రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌తోపాటు ఇషాంత్ కెరీర్లో 100వ టెస్ట్ ఆడనుండడంతో అతడికి తుదిజట్టులో చోటు ఖాయంగా కనబడుతోంది. పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశమున్నా.. డే/నైట్ కావడంతో సాయంత్రం మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టులో కొన్ని మార్పులకు టీమిండియా మేనేజ్మెంట్ తెర లేపొచ్చు. ఇంగ్లండ్ పేసర్లను గ్రీన్ వికెట్‌పై ఎదుర్కొన్న అనుభవం మన బ్యాట్స్మన్లకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరముంది. ఇక మంచు కారణంగా బంతిపై స్పిన్నర్లకు గ్రిప్ దొరక్కపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ పరుగులు రాబట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.
జట్లు:
ఇండియా(అంచనా): కోహ్లి(కెప్టెన్), రోహిత్, శుభ్‌మన్, పుజారా, రహానే, పంత్(వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్, బుమ్రా, ఉమేష్.
ఇంగ్లాండ్(అంచనా): రూట్(కెప్టెన్), అండర్సన్, ఆర్చర్, బెస్/మొయిన్ అలీ, బ్రాడ్, బర్న్స్, క్రాలే, లారెన్స్, లీచ్, పోప్, బెన్ స్టోక్స్/ఓలీ స్టోన్.