Dec 03,2021 17:49

న్యూఢిల్లీ: గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా జగదీష్‌ ఠాకూర్‌ నియమితులయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆయనను గుజరాత్‌ పిసిసి చీఫ్‌గా నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ ప్రకటన చేశారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా అక్కడ ఓటమి పాలవుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత పిసిసి చీఫ్‌ అమిత్‌ చౌదాను తొలగించి.. ఆయన స్థానంలో జగదీష్‌ ఠాకూర్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా పిసిసి పదవి నుంచి తప్పుకున్న అమిత్‌ చౌదా పార్టీ.. రాష్ట్ర అధ్యక్షుడిగా అందించిన సేవలను కాంగ్రెస్‌ కొనియాడింది.