Nov 27,2020 09:50

గాంధీనగర్‌ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఓ కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. రాజ్‌కోట్‌లోని మాద్వీ ప్రాంతంలో ఉన్న ఉదరు శివానంద ఆసుపత్రిలోని ఐసియులో శుక్రవారం తెల్లవారు జామున 1 గంటకు ఈ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 30 మందిని రక్షించి, మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.