Oct 27,2021 22:07

- శంకుస్థాపనలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు
ప్రజాశక్తి కోడూరు :
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు అన్నారు. కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి కొత్తపాలెంలో రూ.77 లక్షలతో నిర్మించే సచివాలయ, రైతు భరోసా, విలేజ్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. అవనిగడ్డ -కోడూరు ప్రధాన రహదారి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నమని ఎమ్మెల్యే తెలిపారు. జయపురం గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రెండు చెరువులకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాలను కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతర భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ పరిసే మాధవరావు, ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వీర వెంకటనారాయణరావు, సర్పంచ్‌ యలవర్తి నాంచారయ్య, పిఎసిఎస్‌ చైర్‌ పర్సన్లు కోసూరు రమేష్‌, బడే సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.