Nov 29,2020 22:37

చందాలు వసూలుచేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ : కాకినాడ జి.మామిడాడ రోడ్డుని బాగు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం ప్రజల నుంచి చందాలు, సంతకాలు సేకరించారు. ప్రభుత్వం, అధికారులు రోడ్లు వేయరని, తామే చందాలు అందజేస్తాము కనీసం గోతులైనా పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం కార్యకర్తలను ప్రజలు వేడుకున్నారు. గంటన్నర వ్యవధిలో రూ.6 వేలు స్వచ్ఛందంగా వాహనదారులు అందచేశారు. ఈ సదర్భంగా సిపిఎం నాయకులు జుత్తుగ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం నవరత్నాలు పేరుచెప్పి ప్రజలను మభ్యపెడుతూ శిధిలావస్థలో ఉన్న రోడ్లపై ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని వాపోయారు. ప్రభుత్వం, అధి కారులు మొద్దునిద్రలో ఉన్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన చందాలతోనైనా మేల్కొని చీడిగ కొవ్వాడ రహదారి ప్రాంతంలో చెరువులను తలపిస్తున్న గోతులను పూడ్చాలని కోరారు. ఇప్పటికే తమతో పాటు కొందరు ముందుకు వచ్చి రబ్బీష్‌ వేసి కొంతమేర గోతులు పూడ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తిరాజు, సూర్యనారాయణ, సూర్యచంద్రరావు, విజరు కుమార్‌, దెయ్యాల చిన్నా, మహేష్‌, ప్రసాద్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.