Sep 17,2021 23:01

బదిలీ ఉపాధ్యాయులకు ధ్రువపత్రాలిస్తున్న డిఇఒ

ప్రజాశక్తి-గుంటూరు : 'గోరుముద్ద'కు సంబంధించిన ఐఎంఎంఎస్‌ అప్లికేషన్‌, డ్యాష్‌ బోర్డుకు సంబంధించిన ఒక్క రోజు శిక్షణ స్థానిక పాత బస్టాండ్‌ వద్ద పరీక్ష భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. శిక్షణకు జిల్లాలోని 57 మండలాల ఎంఇఒలు, నిర్వాహకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్‌ గంగాభవాని మాట్లాడుతూ మధాహ్న భోజనం అమలు, అప్లికేషన్ల విషయంలో అలసత్వం వహించొద్దని చెప్పారు. పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో ఉందని, ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు. ఎక్కడైనా ఇబందులొస్తే ఉప విద్యాశాఖాధికారులు, ఎంఇఒ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు, తెనాలి, ఉప విద్యాశాఖాధికారులు కె.సుధాకర్‌రెడ్డి, వి.శ్రీనివాసరావు, ఎంఇఒల సంఘం నాయకులు సి.హెచ్‌ రవికాంత్‌, శర్మ, ఉర్దూ డి.ఐ. షేక్‌ మహమ్మద్‌ ఖాసీం, మధ్యాహ్న భోజన పర్యవేక్షకులు టి.సాంబశివరావు పాల్గొన్నారు.
క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయులకు బదిలీ కౌన్సెలింగ్‌
జిల్లాలోని పలువురు డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ ఉపాధ్యాయులకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని సమక్షంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇద్దరు డ్రాయింగ్‌ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్‌ యాజమాన్యంలో నలుగురు క్రాఫ్ట్‌, ఒకరు అగ్రికల్చర్‌, ముగ్గురు వీవింగ్‌ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. కార్యక్రమంలో కార్యాలయ పాలనాధికారి షేక్‌.సంధాని, ఉర్దూ డి.ఐ ఖాసిం, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు ఎస్‌.వి.ఆర్‌. ప్రసాద్‌, ఐటీ సెల్‌ సిబ్బంది శివనాగేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, నరేష్‌ పాల్గొన్నారు.