Dec 03,2021 20:20

హైదరాబాద్‌ : పిడియాట్రిక్‌ అండ్‌ కాన్జెన్షియల్‌ ఇంటర్నేషనల్‌ కార్డియోవాస్య్కులర్‌ సొసైటీ (పిఐసిఎస్‌) వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్‌ నాగేశ్వర రావు కోనేటి ఎన్నికయ్యారని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇన్స్‌ట్యూట్‌ తెలిపింది. ఇది అంతర్జాతీయ గుర్తింపు అని పేర్కొంది. దీంతో అత్యున్నత ఫిజీషియన్లలో ఒకరిగా ఆయనకు గుర్తింపు లభించిందని, ఈ వృత్తిలో అత్యున్నత మైలురాయిగా నిలుస్తుందని తెలిపింది. పుట్టకతోనే గుండె వ్యాధులు కలిగిన శిశువులకు ఈ సొసైటీ బృందాలు అతి తక్కువ కోత పద్దతులు ఉపయోగించి చికిత్సనందిస్తాయని పేర్కొంది.