Nov 30,2020 19:40

ఫొటో : రక్షణ చర్యలు చేపడుతున్న వైసిపి నాయకులు

ఫొటో : రక్షణ చర్యలు చేపడుతున్న వైసిపి నాయకులు
గిరిజన గృహాలపై మర్రిచెట్టు
ప్రజాశక్తి-చేజర్ల : మండలంలోని బొడిపాడు గ్రామంలో నివాసముంటున్న గిరిజన కుటుంబాల గృహాలపై మర్రి చెట్టు పడి 6 గృహాలు ద్వంసమాయాయి. వెంటనే విషయం తెలుసుకున్న మండల కన్వీనర్‌ తూమాటి విజయ భాస్కర్‌ రెడ్డి ఆదేశాలతో యువ నాయకులు తూమాటి వంశీ కృష్ణారెడ్డి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి భరోసా ఇచ్చారు. గిరిజనులకు ఎల్లప్పుడూ తమ కుటుంబం అండగా ఉంటుందని తెలియజేశారు. వెంటనే మండల తహశీల్దార్‌తో మాట్లాడి వాళ్లకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
బాధిత కుటుంబాలతో మాట్లాడి త్వరలో మీకు ఇల్లు నిర్మించే విధంగా కృషి చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో విఆర్‌ఒ కేశవ మూర్తి, గ్రామ మాజీ సర్పంచ్‌ బి.సుబ్బారెడ్డి, ఎంపిటిసి షేక్‌ మస్తాన్‌, యువ నాయకులు సుధీర్‌ రెడ్డి, ఆత్మకూరు గణేష్‌, మల్లికార్జునరెడ్డి, రసూల్‌, రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.