Apr 08,2021 12:33

కాలిఫోర్నియా : మహిళలు గోళ్లు పెంచి, వాటికి గోళ్ల రంగు వేసుకుంటే చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ గోళ్లనే ఏళ్ల తరబడి పెంచి.. ఓ మహిళ గిన్నిస్‌రికార్డుకెక్కింది. అమెరికాలోని టెక్సాస్‌కి చెందిన అయన్నా విలియమ్స్‌ అనే మహిళ దాదాపు 30 సంవత్సరాలపాటు గోళ్లను పెంచారు. ఆ గోళ్ల పొడుగు 733.55 సెంటీమీటర్లు. ప్రపంచంలో అతి పొడవైన గోళ్లుగా ఇవి పేరుగాంచి గిన్నిస్‌రికార్డుకెక్కాయి. ఇంత పొడుగున్న గోళ్లు వంపులు తిరిగి ఉన్నా.. ఆమె వాటినెంతో జాగ్రత్తగా చూసుకుంటూ.. ఆకర్షణయంగా ఉండేలా నెయిల్‌పాలిష్‌ కూడా వేసుకునేది. ఇంత మురిపెంగా పెంచుకున్న గోళ్లను డాక్టర్‌ అల్లిసన్‌ రీడింగర్‌ ఎలక్ట్రిక్‌ రోటరీ సాధనంతో కత్తిరించారు. ఇలా గోళ్లు కట్‌ చేసిన ప్రక్రియను, ఆ తర్వాత విలియన్స్‌ తన చేతి వేళ్లను చూసుకుంటున్న దానిని వీడియో తీసి గిన్నిస్  బుక్ ఆఫ్ ‌రికార్డు ఇన్స్ఱాగామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది.