Nov 30,2020 22:05

గడువులోపు పనులు పూర్తి చేయండి : కమిషనర్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:
నగరంలో జరుగుతున్న గరుడ వారధి పనులు గడువులోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌, స్మార్ట్‌ సిటీ గుత్తేదారులతో సోమవారం నగరపాలక సంస్థ వైఎస్‌ఆర్‌ సమావేశం మందిరంలో సమీక్ష నిర్వరహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గరుడ వారధి పనులు గడువు లోపు పూర్తి చేసి ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. అలాగే గరుడ వారధి ఫిల్లర్లుకు కలంకారి బొమ్మలు, ఆకర్షణీయమైన డిజైన్‌ బొమ్మలు వెయ్యాలని ఇంజనీరింగ్‌, స్మార్ట్‌ సిటీ గుత్తేదారులను ఆదేశించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పెద్దకాలువలు పునర్నిర్మించాలని ఆ పనులు కూడా వారంలో అంచనాలు తయారు చేసి పనులు మొదలుపెట్టి వర్షం నీరు నిల్వకుండా చూడాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలన్నారు. వినాయక సాగర్‌ పనులు ఆలస్యం అవుతుందని, ఎక్కువ మంది వర్కర్లు పెట్టి త్వరగా పూర్తి చేయాలని, ఆలస్యం చేస్తే బిల్లులు ఇవ్వడం జరగదని వినాయక సాగర్‌ గుత్తిదారులను హెచ్చరించారు. అలాగే మున్సిపల్‌ పార్కుని కమీషనర్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించి వాకింగ్‌కి ఇబ్బంది లేకుండా చూడాలని, టాయిలెట్లు పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. అనంతరం అక్కడక్కడ వర్షపునీరు, బురద, చెత్త చెదారం చూసి గుత్తేదారులపై మీద అసహనం వ్యక్తం చేశారు, రేపటి లోపల నడకకు ఇబ్బంది లేకుండా చూడాలని, గ్రావెల్‌ వేయాలని ఆదేశించారు. సూపరింటెండెంట్‌ ఇన్‌ ఇంజనీర్‌ మోహన్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, డీఈ విజరుకుమార్‌ రెడ్డి, దేవిక, ఎయికాం బాలాజీ, హేమచంద్ర, ఆపాన్స్‌ స్వామి, గుత్తేదారులు పాల్గొన్నారు.