Dec 29,2020 22:38

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రూ.30 వేలు ఆస్తి నష్టం
ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: 
గడ్డివాము దగ్ధమై రూ.30 వేల ఆస్తినష్టం వాటిల్లిన సంఘటన కోసిగిలోని నడింపాలెం వీధిలో చోటు మంగళవారం చేసుకుంది. నడింపాలెం వీధికి చెందిన రైతు హరిజన మల్లయ్య స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసుకున్న గడ్డివాము దగ్ధమైంది. దగ్ధమైన గడ్డివామును అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. గడ్డివాము దగ్ధం కావడంతో మల్లయ్యకు రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతును ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.