Nov 26,2021 07:37

ట్రిపోలి : లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు లిబియా మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ గడాఫి కుమారుడు సయీఫ్‌ అల్‌ ఇస్లామ్‌ పై ఆ దేశ ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది. డిసెంబరు 24న అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌ జరగనుంది. ఆయన కొన్ని కేసుల్లో దోషిగా ఉన్నందున అనర్హత వేటు వేశారు. కమిటీ నిర్ణయాన్ని ఉన్నత కోర్టులో సవాలు చేయవచ్చు. గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆయనను కాల్చి చంపిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు ఆయన కుమారుణ్ణి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నాయి. ఇందుకోసం కోర్టులను, ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగపరిచేందుకు కూడా అవి వెనుకాడడం లేదు.