
విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డిని పలువురు అభినందించారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎయు మాజీ విసి ఆచార్య జిఎస్ఎన్.రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ దంపతులు, వైసీపీ తూర్పు నియోజకవర్త సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల దంపతులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఎ.రహమాన్, తైనాల విజరు కుమార్, చింతలపూడి వెంకట రామయ్య, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు, నాయకులు గాది శ్రీధర్ రెడ్డి, స్టీఫెన్, కె.అనిల్ కుమార్ రాజు, రాజేష్, పృద్వీ, వైసిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర, కె.వినరు, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాళం పద్మావతి తదితరులు విసిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.