- జెసి రామ్సుందర్రెడ్డి
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్: ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ పూనుకోవాలని జెసి రామ్‌సుందర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై 7 రకాల గోడపత్రికలను సోమవారం జెసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎయిడ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని హెచ్ఐవి బాధితులకు సంఘీభావం తెలిపాలని కోరారు. జిల్లాకు అదనంగా ఒక ఎఆర్టి కేంద్రం - ఆదోనిలో ఏరియా ఆస్పత్రికి మంజూరయిందని పేర్కొన్నారు. హెచ్ఐవి బాధితులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజల భాగస్వామంతో ఎయిడ్స్ రహిత జిల్లాకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడారు. ప్రస్తుతం కరోనా సందర్భంగా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ర్యాలీ, భారీ సమావేశాలు జరపకూడదని, కేవలం కరపత్రాలు ద్వారా అవగాహన కల్పించాలిన సూచించారు. ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో హెచ్ఐవి తగ్గుతుందన్నారు. అడిషనల్ డిఎంహెచ్‌ఒ డాక్టర్ చంద్రారావు (ఎయిడ్స్ అండ్ లెప్రసీ) మాట్లాడుతూ... ఎయిడ్స్ నివారణ దినోత్సవం రోజు జిల్లాలో ఉన్న విద్యార్థులు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులు, ఎన్ఎస్ఎస్ పాల్గొనాలని కోరారు. జిల్లా మేనేజర్ అలీ హైదర్, ఫిజియోథెరపిస్ట్ విక్టర్ మనోహర్, హెచ్‌ఇఒ శివశంకర్ రావు పాల్గొన్నారు.
- జెసి రామ్సుందర్రెడ్డి