
పోస్టర్ ఆవిష్కరిస్తున్న డాక్టర్ జమాల్‌బాష
కడపఅర్బన్ : ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శిక్షణాధికారి డాక్టర్ జమాల్‌బాష అన్నారు. సోమవారం రెడ్‌క్రాస్ సభ్యులు కరీముల్లా రూపొందించిన ఎయిడ్స్ నివారణ పోస్టర్‌ను వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ మనచేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. క్షణికావేశంలో ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోవద్దని చెప్పారు. ఈ నెల 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎయిడ్స్ ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.