Oct 28,2021 19:03

ఎంఆర్‌ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :ఎయిడెడ్‌ విద్యాసంస్థలను, ఎంఆర్‌ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఎంఆర్‌ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. చరిత్ర కలిగిన విద్యా సంస్థలను, లక్షలు మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని తెలిపారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.ధర్నాలో నాయకులు రామకృష్ణ, జగదీష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.