Oct 28,2021 15:29

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎయిడ్‌ కొనసాగించాలని స్థానిక బివిఎం స్కూల్‌ ఆవరణలో విద్యార్ధులు వారి తల్లితండ్రులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పవన్‌, ఎన్‌.రాజా మాట్లాడారు. ప్రభుత్వ జిఒ నెంబర్‌ 42, 50 తీసుకువచ్చి ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ హయాంతో జిఒ 35ను తీసుకువచ్చి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిలిపేశారన్నారు. ఒకవేళ విద్యాసంస్థలు ప్రయివేటుపరం చేస్తే పేద, మధ్యతరగతి విద్యార్ధులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల జిఒ 35ను రద్దు చేసి ఎయిడ్‌ కొనసాగించాలి అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మూర్తి, శివ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.