Jan 14,2021 12:46

తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం దువ్వవయ్యారు ఏటిగట్టు పై వివాహిత దారుణహత్య కు గురయిన ఘటన గురువారం వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపధ్యంలో.. భార్య పచ్చల వరలక్ష్మి (35) ని భర్త శ్రీను పీకకోసి హత్య చేసి పరారయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.