Oct 14,2021 22:51

ఎస్వియు టైం స్కేల్‌ ఉద్యోగుల సమ్మె విరమణ

ప్రజాశక్తి - క్యాంపస్‌: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా టైంస్కేల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసంఘం నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. గురువారం టైం స్కేల్‌ ఉద్యోగులు ఆచార్య రాజారెడ్డితో చర్చలు జరిపిన తర్వాత విసి సాను కూలంగా స్పందించడంతో ధర్నాను విరమిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఎర్రసాని సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. ఎస్వీయు టైంస్కేల్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను జరగబోయే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పెట్టి టైంస్కేల్‌ ఉద్యోగులను అందరిని నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీలు ఆధారంగా అర్హతను బట్టి రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం టైంస్కేల్‌ ఉద్యోగులను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పెట్టి చర్చిస్తామని వైస్‌ ఛాన్సలర్‌ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. టైంస్కేల్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపిన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డికి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ గురుమూర్తికి రాయలసీమ యువజన విభాగం అధ్యక్షులు హరి ప్రసాద్‌రెడ్డికి, రిజిస్టార్‌ మహమ్మద్‌ హుస్సేన్‌కి, డిడిఈ డైరెక్టర్‌ ఎస్‌వి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా సిఐటియు నాయకులు ఎస్వీయూ టైంస్కేల్‌ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు వందవాసి నాగరాజుకి తమ ప్రధాన కతజ్ఞతలు తెలిపారు.