Nov 30,2020 21:01

ఎస్‌పిని కలిసిన డిఎస్‌పి

కడపటౌన్‌ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డిఎస్‌పిగా రవి కుమార్‌ బాధ్యతలు చేప ట్టారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎస్‌పి అన్బు రాజన్‌ను మ ర్యాదపూర్వకంగా కలి శారు. 1995 బ్యాచ్‌కు చెందిన రవికుమార్‌ స్వస్థలం కర్నూలు. గతంలో ఆయన ఎస్‌ఐగా కడప, చాపాడు, సంబేపల్లి, కొండాపురం, చిట్వేలి, బద్వేల్‌లలో పనిచేశారు. తరువాత పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్‌జోన్‌ సిఐడిగా పని చేశారు. రాయచోటి రూరల్‌, అనంతపురం సిసిఎస్‌, కదిరి రూరల్‌, ఒంటిమిట్టలలో ఫ్యాక్షన్‌ జోన్‌గా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం కడప ఎస్సీ, ఎస్టీ డిఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించారు.