Jan 28,2021 11:46

విజయనగరం : జిల్లాలోని బొండపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఎఇగా పని చేస్తున్న దాసరి మురళీమోహన్‌ రావు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. పొలానికి విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలని ఇటీవల ఓ రైతు మురళీమోహన్‌రావును కలిశాడు. అయితే, విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు రైతు నుంచి మరళీమోహన్‌ రావు రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్న ఎసిబి అధికారులు.. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మురళీమోహన్‌ రావును అధికారులు పట్టుకున్నారు.