
నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
ప్రజాశక్తి-కందుకూరు: ఢిల్లీలో రైతులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ కందుకూరు ఆర్టిసి బస్టాండ్ వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. రైతుల ఆందోళనను అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి మెండా శ్రీహర్ష, జిల్లా నాయకులు అవినాష్, దత్తు, సుమన్, అరుణ్ పాల్గొన్నారు.