Jun 11,2021 07:12

కంటి నుంచి కలలెన్నో రాలిపోతున్నాయి
పిడికిళ్ళలో ప్రాణాలెన్నో జారిపోతున్నాయి
మానవ ప్రపంచం తల లేని మొండెంగా మారిపోయింది
ఏదీ శాశ్వతం కాదని తేలిపోయింది
దేశాధినేతలారా ...
ఏం జరిగినా వెన్ను చూపేది లేదని
కరోనా పై యుద్ధం చేస్తున్న కామ్రేడ్‌ లను చూచి నేర్చుకోండి
కూల్చండి కులాలను, మతాలను, కుళ్ళు రాజకీయాలను
మంచితనం ఇంకిపోయిన కాలాన్ని ఒడిలోకి తీసుకుని
మనుషుల ముఖాల మీది దుఖా:న్ని తుడిచి
మహమ్మారి కరోనా కాటేస్తున్న బతుకులకు లేపనాలు పూసి
మానవత్వపు విత్తుల్ని వెదజల్లుతున్న మార్క్సిస్టుల్ని చూసి నేర్చుకోండి
కామ్రేడ్స్‌
ఐసొలేషన్‌కి వచ్చినవారు 'మమ్మల్ని కన్నడ్డల్లా చూసుకుంటున్నారు
మరో జన్మిచ్చి బ్రతికిస్తున్నారు' అంటుంటే చాలా బాగుంది
కానీ......
పుట్టే ప్రతి బిడ్డా అమ్మ రక్తాన్ని ఒంటికి పూసుకుని బయటకు వస్తున్నట్లు
వీళ్ళు కూడా...ఎంతోకొంత ఎరుపు రంగు పూసుకుని ఇంటికెళితే
ఇంకా బాగుంటుంది.
 

- జి. లూధర్‌ పాల్‌