Apr 08,2021 18:06

అమరావతి : ఎపిలో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. నెల క్రితం వరకు కేసులు పదుల్లో ఉండగా.. గత మూడు, నాలుగు వారాలుగా వేలల్లో నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్‌ పరీక్షించగా మరో 2,558 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 9,15,832కు చేరింది. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,268కి చేరింది. అదే సమయంలో 915 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,89,651కు చేరింది. మరో 14,913 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 399, కర్నూలు జిల్లాలో 344, విశాఖ జిల్లాలో 290, నెల్లూరు జిల్లాలో 204, శ్రీకాకుళం జిల్లాలో 185, ప్రకాశం జిల్లాలో 153, కృష్ణా జిల్లాలో 152, అనంతపురం జిల్లాలో 131, కడప జిల్లాలో 94, తూర్పు గోదావరి జిల్లాలో 58, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 1,25,587 పాజిటివ్‌ కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా 94,663 కేసులు, చిత్తూరు జిల్లా 92,205 కేసులు, గుంటూరు జిల్లా 80,525 కేసులు, అనంతపురం జిల్లా 69,031, నెల్లూరు జిల్లా 64,398, విశాఖపట్నం జిల్లా 63,577 కేసులతో వరుసగా ఉన్నాయి. మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.