Feb 04,2021 16:57

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బుటెటిన్‌ విడుదల చేసింది. 28, 254 నమూనాలను పరీక్షించగా 79కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8, 88, 178కి చేరింది. 24 గంటల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. అయితే.. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 7,157 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1154 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,32,42,502 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ప్రకటనలో వెల్లడించింది.