శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 14న ‘పళ్లబురుసు’

06 ఆగస్టు, 2026

pallaburusu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తండ్రీకొడుకులుగా కలిసి నటించిన చిత్రం ‘పళ్లబురుసు’. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎపిక్ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. హీరో నాగార్జున ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. నిర్మాత నాగార్జున కూడా ఈ సినిమా ప్రచారంలో భాగం కానున్నట్లు సమాచారం. ‘పళ్లబురుసు’ యూనిట్‌తో ఆయన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారని, అది ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్