Feb 23,2021 21:41

న్యూఢిల్లీ : విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దబోల్‌ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన రత్నగిరి గ్యాస్‌ అండ్‌ పవర్‌ ప్రయివేటు లిమిటెడ్‌ (ఆర్‌జిపిపిఎల్‌)లోని గెయిల్‌కు చెందిన 25.51 శాతం వాటాను మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి స్వాధీనం చేసుకుంది. ఈ వాటా కొనుగోలు తర్వాత ఆర్‌జిపిపిఎల్‌లో ఎన్‌టిపిసి వాటా 86.49 శాతానికి చేరినట్లయ్యింది. తొలుత ఈ సంస్థలో ఎన్‌టిపిసి, గెయిల్‌ సమానంగా 25.51 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. 2005లో ఈ సంస్థను ఇవే ఇరు సంస్థలు ఏర్పాటు చేశాయి.