Nov 21,2020 10:25

ఎన్టీఆర్‌కు, తనకు ఎనర్జీ లెవెల్స్‌ కొంచెం ఎక్కువేనని చెప్పుకొచ్చింది నటి పూజాహెగ్డే. ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అరవింద సమేత' సినిమా గురించి పూజాహెగ్డే స్పందించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ''అరవింద సమేత ఎప్పటికీ నాకు ఓ ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో నాకు లభించింది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపింది. మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్‌ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఆన్‌స్క్రీన్‌లో మా జోడి ప్రేక్షకులను అన్ని విధాలుగా అలరించింది. ఆన్‌స్క్రీనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో సైతం ఈ చిత్రం నాకెన్నో అనుభవాలను అందించింది. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను'' అని ఆనాటి చిత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కె.రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న 'రాధేశ్యామ్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలసిందే. ఎన్టీఆర్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో బిజీగా ఉన్నారు.