Feb 10,2021 00:23

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - అనకాపల్లి
అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్‌ వినరుచంద్‌, ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. అనకాపల్లి మండలంలో మారేడుపూడి, అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లో ప్రవీణ్‌కుమార్‌ పర్యటించారు. ఓటింగ్‌ సరళిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలి ంగ్‌ సిబ్బందిని పోలింగ్‌ జరిగిన తీరుపై అడిగారు. ఆయన వెంట ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఉన్నారు.
కొత్తూరు గ్రామంలో కలెక్టర్‌ వినరుచంద్‌ పర్యటించారు. ఏఎంఏఏ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో సీతారామారావు, తదితరులు ఉన్నారు.