Sep 01,2020 20:08

న్యూఢిల్లీ : నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, 1984 జార్ఖండ్‌ కేడర్‌ బ్యాచ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్ష పదవికి ఆగస్టులో రాజీనామా చేసిన రాజీవ్‌ గత ఎన్నికల కమిషనర్‌ అశోక లావాసా స్థానంలో నియమితులయ్యారు. ఏప్రిల్‌ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాజీవ్‌ను పబ్లిక్‌ ఎంట్రర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (పీఈఎస్‌బీ) ఆసియా అభివృద్ధి బ్యాంకు చైర్మన్‌గా నియమించింది. రాజీవ్‌ కుమార్‌కు అనేక రంగాలైన పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్‌గా 36 అనుభవం ఉంది. మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు.