Nov 26,2020 19:54

తమిళ హీరోలు విశాల్‌, ఆర్య కలిసి మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో 'ఎనిమి' టైటిల్‌ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హీరోగా విశాల్‌, విలన్‌ పాత్రలో ఆర్య నటిస్తున్నట్లు తెలిపారు. నటి మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.