Nov 29,2020 23:19

mch

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌: స్థానిక ప్రభుత్వ మాతా, శిశు వైద్యశాలకు మాజీ సైనికులు విరాళంగా ఇచ్చిన ఇంక్యూబేటర్‌ యంత్రాలు, ఫొటోథెరపీ యూనిట్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైద్యాధికారులకు హాస్పిటల్‌లో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు దేశ సేవతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేషనల్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు నెప్పల్లి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాశం వెంకట్‌ రెడ్డి, మిలటరీ క్యాంటీన్‌ మేనేజర్‌ జి.వెంకట్రావు, నాయకులు జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.