Nov 30,2020 23:02

ఎంగేల్స్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - వినుకొండ : ఫ్రెడరిక్‌ ఎంగేల్స్‌ ఆశయాలను కొనసాగించాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హనుమంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఫుతుంబాక వెంకటపతి భవన్లో ఎంగేల్స్‌ 200 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రపంచంలో కార్మికులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంగేల్స్‌ పోరాడారని గుర్తు చేశారు. తొలుత ఎంగేల్స్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెడ్డి బోయిన ప్రసన్నకుమార్‌, గుంజరి ఏసు, చిదంబరం, నాసర్‌ బి, రంజాన్‌ పాల్గొన్నారు.